
.jpg&w=3840&q=75)
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసే ప్రక్రియ మరో కొత్త దశలోకి చేరింది. కంపెనీ కొనుగోలుకు ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ముందుకొచ్చి ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, హాలీవుడ్ నిర్మాణ సంస్థ పారామౌంట్ స్కైడాన్స్ ఈ పోటీలోకి ప్రవేశించింది. సోమవారం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కోసం కంపెనీ అధికారికంగా టేకోవర్ బిడ్‌ను సమర్పించింది.
పారామౌంట్ ఈ కొనుగోలుకు 108.4 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసింది. ఈ మొత్తం కంపెనీ విలువను, అప్పులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిర్ణయించబడినదిగా సమాచారం. ఈ ఆఫర్ నెట్‌ఫ్లిక్స్ ప్రతిపాదించిన రూ.6.5 లక్షల కోట్ల విలువకంటే గణనీయంగా ఎక్కువ.
నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీలోని హాలీవుడ్ స్టూడియోలు, స్ట్రీమింగ్ వ్యాపారం పై మాత్రమే ఆసక్తి చూపించగా, పారామౌంట్ మాత్రం సంస్థ మొత్తం కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఒక్కో షేర్‌కు 27.75 డాలర్లు ఆఫర్ చేయగా, పారామౌంట్ ఒక్కో షేర్‌కు 30 డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైంది.
అయితే ఈ పెద్ద మొత్తంలో జరిగే కొనుగోలు ఒప్పందం యాంటీట్రెస్ట్ (పోటీ వ్యతిరేక చట్టాలు) దృష్ట్యా భారీ పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ నెట్‌ఫ్లిక్స్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని, విక్రయ ప్రక్రియలో పారదర్శకత లేకుండా పారామౌంట్‌కు ప్రతికూలంగా చర్యలు తీసుకుంటోందని పారామౌంట్ ఆరోపించింది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!