
న్యూస్

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుని తీవ్ర ఆందోళనకు దారి తీసింది. మిసిసిప్పి రాష్ట్రంలోని వెస్ట్ పాయింట్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి మూడు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో కనీసం ఆరు మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలాలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేస్తూ, ఘటనకు గల కారణాలు మరియు మృతుల వివరాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!