
న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTCకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. గవర్నెన్స్ నౌ నిర్వహించిన 6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును APSRTC సొంతం చేసుకుంది. గత ఏడాది బస్ స్టేషన్లలో బస్సుల రాకపోకలను ముందుగానే ప్రకటిస్తూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు ఈ అవార్డును అందజేశారు.
ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని RTC చీఫ్ ఇంజినీర్ వై. శ్రీనివాస రావు స్వీకరించారు. డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నందుకు APSRTCకు ఈ గుర్తింపు లభించిందని అధికారులు తెలిపారు. గతంలో కూడా APSRTCకు కేంద్ర ప్రభుత్వ అవార్డులతో పాటు స్కోచ్ పురస్కారాలు లభించిన విషయం తెలిసిందే.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!