

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఐ–క్వాంటం ఎకోసిస్టమ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఒప్పందాలు కుదుర్చుకుంది. అమరావతిని “క్వాంటం వ్యాలీ”గా అభివృద్ధి చేయడంలో భాగంగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఐబీఎం సహా ప్రముఖ సంస్థలతో కుదిరిన ఈ ఒప్పందాలు ఏపీలో ఏఐ, క్వాంటం రంగాల్లో నైపుణ్యాభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల విస్తరణకు దోహదం చేయనున్నాయి.
ఈ ఒప్పందాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏఐ–క్వాంటం హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. విద్యార్థులు, యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడం, పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం, ప్రభుత్వ సేవల్లో ఏఐ–క్వాంటం వినియోగాన్ని పెంపొందించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. టెక్నాలజీ ఆధారిత సేవల ద్వారా ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!