
ఆరోగ్యం

కోడి పందాలు, జూద కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూద నిరోధక చట్టాలు, జంతు హింస నిరోధక చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. కోడి పందాలు నిర్వహించే బరులపై సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
చట్టసువ్యవస్థ పరిరక్షణ కోసం అవసరమైతే సెక్షన్ 144 అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు హైకోర్టు సూచించింది. కోడి పందాలు, జూదంలో వినియోగించిన సొమ్మును వెంటనే సీజ్ చేయాలని కూడా ఆదేశించింది. ప్రజల భద్రతకు భంగం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోర్టు అధికారులకు స్పష్టం చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!