
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో టీనేజీ ప్రెగ్నెన్సీలు ఆందోళనకర స్థాయిలో పెరిగినట్లు వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.8 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవడం, ప్రజారోగ్య పరంగా గంభీర సమస్యగా మారుతోంది.
సర్వే ప్రకారం, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా 14.9 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో 12 శాతం కంటే ఎక్కువ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. ఈ వివరాలను హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ అధికారికంగా ప్రకటించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!