

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరుకానున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మరియు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించబడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం 10.50 గంటలకు ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరిగే ఈ సదస్సులో ఆయన పాల్గొంటారు.
ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఫిన్లాండ్ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సహా ప్రపంచవ్యాప్తంగా 110 దేశాలకు చెందిన సుమారు 2,700 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ‘జియో పాలిటిక్స్–జియో ఎకనామిక్స్’ అనే ప్రధాన అంశం ఆధారంగా ఈ సదస్సులో వివిధ అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “సాంకేతికత–సుపరిపాలన–భవిష్యత్” అనే అంశంపై కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాలు, డిజిటల్ పౌర సేవల అమలు వంటి అంశాలను వివరించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ను అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ఆయన వివరించనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!