
ఓటిటి

మెగా కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా చిత్రం రకాసా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తున్నారు. దర్శకురాలు మానస శర్మ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఏప్రిల్ 3 న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో నిహారిక స్టేజ్ పై డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. హీరో సంగీత్ శోభన్‌తో కలిసి చేసిన ఈ ప్రదర్శనకు మంచి స్పందన వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీన్ని చూసిన అభిమానులు నిహారికలో మళ్లీ పాత ఉత్సాహం కనిపిస్తోందని వ్యాఖ్యలు చేస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!