
బిజినెస్

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు పుదుచ్చేరికి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఆయనను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల పరిశీలకుడిగా మరియు స్టార్ ప్రచారకర్తగా నియమించింది. ఈ క్రమంలో పుదుచ్చేరిలో పార్టీ బలపరిచే దిశగా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.
మూడు రోజుల పాటు పుదుచ్చేరిలోనే ఉండి వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహించి, పార్టీ వ్యూహాలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసే ప్రయత్నం జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.









-1774425417157.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!