

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర ఆరోపణలు చేశారు. గన్‌పార్క్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను విస్మరించారని విమర్శించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ అనుమతులు లేకుండా మైనింగ్ అక్రమాలకు పాల్పడిందని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు కూడా చెల్లించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కూడా భాగస్వామ్యంగా ఉన్నారని ఆయన ఆరోపిస్తూ, పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇక గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మంత్రుల అవినీతిపై ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తితో విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరారు. ఈ నిరసనలో వాణి దేవి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!