

దళపతి విజయ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ విడుదల తేదీపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు ఈ వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 24న సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రభావం సినిమాపై పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఈ నెల 24వ తేదీన విడుదల అయితే, బాక్సాఫీస్ వద్ద సినిమాకు మంచి లాభం కలిగే అవకాశం ఉంది. ఆ సమయంలో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం, అలాగే మే డే సెలవులు దగ్గరగా ఉండటం కలెక్షన్లకు అనుకూలంగా మారనుంది. ఒకవేళ ఈ నెల 30న విడుదల చేస్తే, ‘కరా’, ‘పెద్ది’ వంటి భారీ చిత్రాల పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ నెల 24 కే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం మొదట జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ సమస్యల వల్ల వాయిదా పడింది. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సమయంలో ఈ సినిమా ఆయన కెరీర్‌లో కీలకంగా మారింది. ప్రస్తుతం రివైజింగ్ కమిటీ నుంచి అనుమతి కోసం కెవిఎన్ ప్రొడక్షన్స్ ఎదురు చూస్తోంది. ఈ వారంలో సర్టిఫికేషన్ పూర్తయిన వెంటనే అధికారిక విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!