

దేశంలో జీఎస్టీ (స్థూల వస్తు, సేవల పన్ను) వసూళ్లు గణనీయంగా పెరిగాయి. మార్చి నెలలో 8.8 శాతం వృద్ధితో సుమారు రూ.2 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. దేశీయంగా విక్రయాలు పెరగడం, అలాగే దిగుమతులు అధికమవడం వల్ల పన్ను వసూళ్లు ఈ స్థాయికి చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. గతేడాది మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.83 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
దేశీయ విక్రయాల ద్వారా 5.8 శాతం వృద్ధితో రూ.1.46 లక్షల కోట్ల ఆదాయం లభించగా, దిగుమతులపై పన్నుల రూపంలో 17.8 శాతం పెరుగుదలతో రూ.53,861 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ఈ రెండు అంశాలు కలిసి జీఎస్టీ వసూళ్ల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
రిఫండ్ల సర్దుబాటు తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం జీఎస్టీ వసూళ్లు 8.3 శాతం వృద్ధితో రూ.22.27 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!