

రామ్ చక్రి దర్శకత్వంలో, అరుణ్ రంగరాజులు నిర్మాణంలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ ఈ నెల 3, 2026 న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటించగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ, ఈ సినిమా మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తూ అప్పుల వల్ల కుటుంబాల్లో వచ్చే సమస్యలను వాస్తవికంగా చూపిస్తుందని తెలిపారు. ముఖ్యంగా అప్పులతో బాధపడుతున్న వారికి ఈ చిత్రం ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. అలాగే “సంగీత సేవ” అనే కొత్త భావన ద్వారా సంగీతానికి సంబంధించిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు మరియు ఆదాయం పంచే విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రం ప్రతి మధ్యతరగతి కుటుంబానికి అనుసంధానమవుతుందని చిత్రబృందం నమ్ముతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!