

అల్లు అర్జున్ పుట్టినరోజు దగ్గరకొచ్చేసింది. దీంతో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆయన కొత్త సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌తో పాటు సినిమా టైటిల్‌ను విడుదల చేస్తామని నిర్మాత బన్నీ వాసు వెల్లడించారు. ఈ వార్త అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని పెంచింది.
అయితే ఈ ఆనందం మధ్యలోనే సినిమా బృందానికి ఒక సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. పుట్టినరోజు వేడుకల తర్వాత దుబాయిలో కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇందులో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ పశ్చిమాసియా ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయి షూటింగ్‌ను రద్దు చేసినట్లు సమాచారం. ఇక ఈ షూటింగ్‌ను వేరే దేశానికి మార్చుతారా లేదా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత దుబాయిలోనే కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ఇప్పటివరకు ముంబైలో నిర్మించిన ప్రత్యేక సెట్స్‌లో అల్లు అర్జున్, దీపికా పదుకొణే పై కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కావచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ షూటింగ్ ఆలస్య వార్తలతో సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!