
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)పై పలు ఆరోపణలు వెలువడుతున్నాయి. తెలంగాణలోని కొన్ని క్రికెట్ సంఘాలు కలిసి అవినీతి మరియు అక్రమాలపై ఫిర్యాదులు చేశాయి. ఈ విషయంపై ఏసీబీ, సీఐడీ మరియు ఈడీకి అధికారికంగా ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరాయి.
క్రికెట్ సంఘాల ఆరోపణల ప్రకారం, హెచ్‌సీఏలోని కొంతమంది పెద్దలు మాఫియా తరహాలో వ్యవహరిస్తూ సంస్థను దోచుకుంటున్నారని అంటున్నారు. ఈ ఆరోపణలపై నిజాలు బయటపడాలంటే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) పట్టుబడుతోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను ప్రక్షాళన చేయాలని క్రికెట్ సంఘాలు కోరుతున్నాయి. క్రీడల అభివృద్ధి కోసం హెచ్‌సీఏను పారదర్శకంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!