
న్యూస్

దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ “బ్లాక్ మండే”ను నమోదు చేశాయి. దలాల్ స్ట్రీట్లో భారీ అమ్మకాలతో BSE సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా పడిపోయింది. అలాగే నిఫ్టీ 50 450 పాయింట్లకు పైగా నష్టపోయింది. కేవలం 8 నిమిషాల్లోనే దాదాపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోవడం ఆందోళన కలిగించింది.
ప్రపంచవ్యాప్తంగా కీలక చర్చలు విఫలమవడం, ముడి చమురు ధరలు పెరగడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. అదనంగా US డాలర్ బలపడటంతో రూపాయి మారకం విలువ రూ.93.39కు చేరింది. ఈ పరిణామాలు మార్కెట్లలో అస్థిరతను పెంచుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!