
న్యూస్

సమీరా రెడ్డి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి గురించి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నటన ఒక్కటే సరిపోదని, లుక్ ఆధారంగానే అవకాశాలు వస్తాయని ఆమె తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లలో కూడా హీరోయిన్లను వారి బట్టలు, బ్యాగులు చూసి అంచనా వేయడం జరుగుతుందని, ఈ పరిస్థితి వల్ల ఎప్పుడూ ఒత్తిడిలో ఉండాల్సి వచ్చేదని చెప్పారు.
ఆ ఒత్తిడి కారణంగా తాను కూడా లక్షలు ఖర్చు చేసి లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసినట్లు సమీరా వెల్లడించారు. ఇప్పుడు ఆ ఖర్చులపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, ఆ డబ్బుతో బంగారం కొనుక్కుంటే బాగుండేదని అన్నారు. ప్రస్తుతం ఆమె ఆడంబరాలకు దూరంగా ఉండి, ఆర్గానిక్ దుస్తులను ఉపయోగిస్తూ సాదాసీదా జీవితం గడుపుతున్నారు. గ్లామర్ కంటే మానసిక ప్రశాంతత ముఖ్యమని ఆమె తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!