

హైదరాబాద్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. చలికాలంలో ఏర్పడుతున్న పొగమంచు, చెత్తాచెదారం దహనం, వాహనాల నుంచి వెలువడుతున్న పొగ కారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తీవ్రంగా పెరిగింది. ఆదివారం తెల్లవారుజామున నగరంలో AQI స్థాయి 261కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణంగా డబుల్ డిజిట్లో ఉండాల్సిన గాలి నాణ్యత ఈ స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా బాలానగర్, సనత్నగర్, జీడిమెట్ల, మల్లాపూర్ ప్రాంతాల్లో కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల వల్ల శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించాలని, పిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.








.jpeg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!