

ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశ డేటా హబ్‌గా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు, IT మంత్రి నారా లోకేష్ విజన్ వేగంగా నిజమవుతోంది. ఇటీవలే ₹87,000 కోట్ల భారీ బడ్జెట్‌తో గూగుల్ విశాఖలో తన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు అదే దారిలో మరో దిగ్గజం రిలయన్స్ కూడా అడుగులు వేసింది.
విశాఖలో జరుగుతున్న ఇన్వెస్టర్ సమ్మిట్‌లో రిలయన్స్, ఆంధ్రప్రదేశ్‌లో 1 GW AI డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి శక్తిని అందించేందుకు 6 GWp సౌర విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించనుంది. అదనంగా, కర్నూలులో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్, అలాగే పలు కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్‌లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది.
ఈ ప్రాజెక్టులకు సంబంధించి CII పార్ట్నర్షిప్ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో MoU సంతకం జరిగింది. ఈ కొత్త పెట్టుబడులు, రాష్ట్రంలో రిలయన్స్ ఇప్పటికే చేసిన $25 బిలియన్ పెట్టుబడులకు మరింత బలం చేకూరుస్తాయి.
గూగుల్, రిలయన్స్ రెండు సంస్థలు కూడా 1 GW హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు APలో ఏర్పాటు చేయడంతో, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ హబ్‌గా ఎదగబోతోందని నిపుణులు భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!