

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానున్నారు. రష్యా ప్రభుత్వ మీడియా ప్రకారం ఈ భేటీ ఈ రోజు మాస్కోలో జరగనుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ రష్యా–ఇరాన్ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోంది.
క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపిన వివరాల ప్రకారం, అధ్యక్షుడు పుతిన్ ఈ సమావేశానికి సిద్ధమవుతున్నారు. అయితే సమావేశ అజెండాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. మరోవైపు రష్యాలోని ఇరాన్ రాయబారి కజేమ్ జలాలీ మాట్లాడుతూ, ఈ భేటీలో అమెరికాతో తాజా చర్చల పరిస్థితి, కాల్పుల విరమణ అంశాలు అలాగే ప్రాంతీయ పరిణామాలపై చర్చలు జరగనున్నాయని తెలిపారు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకారం, అబ్బాస్ అరాగ్చీ ఇప్పటికే ఇస్లామాబాద్ నుంచి రష్యాకు బయలుదేరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!