
న్యూస్

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడితో అట్టుడుకుతున్న పశ్చిమాసియలో తీవ్ర ఇంధన కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న ఇంధన నిల్వలు, రాబోయే వారం రోజులకు అవసరమైన నిల్వల వివరాల గురించి పూర్తి సమాచారం తెలియజేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మంగళవారం దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వాహకులను ఆదేశించింది.
ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడినందున ముందు జాగ్రత్తగా ఏఏఐ ఈ వివరాలు సేకరిస్తున్నదని ఒక ఉన్నతాధికారి చెప్పారు. రాబోయే వారం రోజులకు అవసరం కానున్న ఇంధనం, షెడ్యూల్ చేసిన తదుపరి ఇంధనం నింపే తేదీ వివరాలను పంపాలని దేశంలో 33 అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏఏఏఐ ఆదేశించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!