

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అమరుల త్యాగాలకు నివాళులర్పించారు. రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంగా సేవలందిస్తున్నామని పేర్కొన్న ఆయన, గత రెండున్నరేళ్లలో ప్రజల ఆశయాల సాధన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రైతు రుణమాఫీ కోసం రూ.20,616 కోట్లు ఖర్చు చేయగా, రైతుభరోసా కింద రూ.27,529 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.

అదే సమయంలో ధాన్యం కొనుగోళ్లకు రూ.82,840 కోట్లు ఖర్చు చేశామని, మహిళా సంఘాలకు రూ.60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించినట్లు తెలిపారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలకు రూ.10 వేల కోట్ల మేర ఆదా కలిగిందన్నారు. 67,763 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 15.12 లక్షల కొత్త రేషన్ కార్డుల జారీ వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!