

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. శశాంక్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరై డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ గీతం, రాష్ట్ర గీతాలాపన కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన డా. శశాంక్ గోయల్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తైన సందర్భంగా ప్రజల ఆకాంక్షలు, త్యాగాలు, అభివృద్ధి ప్రయాణాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పారదర్శక విధానాలు, బలమైన మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అనుమతుల కారణంగా తెలంగాణ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో రాష్ట్రం విశేష పురోగతి సాధించిందని, ఐటీ ఎగుమతులు ₹3.13 లక్షల కోట్లకు చేరుకోవడం రాష్ట్ర ఆర్థిక శక్తికి నిదర్శనమని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!