

'ఉప్పెన' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా గుర్తింపు పొందిన కృతి శెట్టి, వరుసగా వచ్చిన కొన్ని సినిమా పరాజయాల నేపథ్యంలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో సోషల్ మీడియాలో కొందరు ఆమెను "ఐరన్ లెగ్" అంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి తన అభిప్రాయాలను వెల్లడించింది.
సినిమా ఫ్లాప్ అయితే దానికి హీరోయిన్లనే బాధ్యులను చేయడం సరికాదని కృతి శెట్టి పేర్కొంది. కథ, దర్శకత్వం లేదా ఇతర కీలక నిర్ణయాల్లో హీరోయిన్ల పాత్ర చాలా పరిమితంగా ఉంటుందని, అయినప్పటికీ వారిపైనే నిందలు వేయడం అన్యాయమని ఆమె అభిప్రాయపడింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు విజయానికి క్రెడిట్ తీసుకునే నటీనటులు పరాజయానికి కూడా బాధ్యత వహించాలని అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!