

బాలీవుడ్లో సంచలన విజయాన్ని అందుకున్న 'సయారా' సినిమా కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమకథా చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు మోహిత్ సూరి, తన కొత్త రొమాంటిక్ డ్రామా 'సత్రంగా' కోసం అహాన్ పాండే, అనీత్ పడ్డాలను మళ్లీ ఎంపిక చేశారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ప్రారంభం కానుంది.
ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కథలో మార్పులు, మ్యూజిక్ సిట్టింగ్స్ వంటి పనుల్లో చిత్రబృందం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 'సయారా' విజయం తర్వాత అదే టీమ్ మళ్లీ కలిసి పని చేయడం మేకర్స్‌కు మరింత నమ్మకాన్ని కలిగిస్తోంది. అహాన్ పాండే ప్రస్తుతం అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తుండగా, అనీత్ పడ్డా 'శక్తి శాలిని' ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. ఈ కమిట్మెంట్లు పూర్తయిన తర్వాత ఇద్దరూ 'సత్రంగా' షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!