
సినిమాలు

విద్యాసంస్థలకు సెలవులు, పరీక్షల ఫలితాల నేపథ్యంలో గత నెలలో తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించిన వివరాల ప్రకారం, గత నెలలో మొత్తం 25 లక్షల 46 వేల 168 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత నెల 24న అత్యధికంగా 98 వేల 58 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు.
గత నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.120.28 కోట్లుగా నమోదైంది. ఇదే కాలంలో 12 లక్షల 29 వేల 773 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. వేసవి సెలవులు, పరీక్షల ఫలితాల కారణంగా భక్తుల రద్దీ పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల తొలి రెండు వారాల్లో కూడా ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!