
సినిమాలు

పరీక్ష ఫలితాల రీ-వెరిఫికేషన్ మరియు రీ-ఎవాల్యుయేషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్‌ను CBSE ప్రధాన కార్యాలయం ప్రారంభించింది. తమ ఫలితాలపై పునఃపరిశీలన కోరుకునే విద్యార్థులు అధికారిక CBSE పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా దరఖాస్తు ప్రక్రియలో ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది.
ఆధార్ కార్డు లేని విద్యార్థులు తల్లిదండ్రులు, సంరక్షకులు లేదా బంధువుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చని CBSE స్పష్టం చేసింది. అయితే దరఖాస్తులో నమోదు చేసే పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ఉపయోగిస్తున్న ఆధార్‌లోని వివరాలకు పూర్తిగా సరిపోవాలని సూచించింది. దరఖాస్తు సమర్పించే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని విద్యార్థులకు బోర్డు సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!