

మేడారం మహాజాతరకు ముందుగా సమ్మక్క తల్లికి పుట్టింటి చీర సమర్పించే సంప్రదాయం ఘనంగా జరిగింది. సమ్మక్కను చందా వంశ ఆడబిడ్డగా భావిస్తూ, పుట్టింటి వారైన చందా వంశీయులు ఆడపడుచు లాంఛనాల్లో భాగంగా గురువారం చీర సారెతో పాటు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, ఒడిబియ్యాన్ని సమ్మక్క గద్దె వద్ద సమర్పించారు. తాడ్వాయి మండలం బయ్యక్కపేట గ్రామానికి చెందిన చందా బాబురావు కుటుంబ సభ్యులతో కలిసి మేడారం చేరుకుని వనదేవతలను దర్శించుకున్నారు.
మహాజాతర సందర్భంగా మండె మెలిగే పండుగను పూజారులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బుధవారం రాత్రి గద్దెల వద్ద జాగారం చేసిన పూజారులు గురువారం ఉదయం సూర్యోదయానికి ముందు జాగారాన్ని ముగించి వనదేవతల గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం డోలు వాయిద్యాల నడుమ గ్రామాల గుడులకు తిరుగు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పూజారుల ముందు నేలపై పడుకుని మొక్కులు చెల్లించగా, ఈ తంతుతో చిడపీడలు తొలగి సంతానం కలుగుతుందని విశ్వసిస్తున్నారు. ఈ విధంగా మండె మెలిగే పండుగ ముగియగా, ఈ నెల 28 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!