

స్పెయిన్‌లో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దక్షిణ స్పెయిన్‌లోని అడమూజ్ పట్టణం సమీపంలో రెండు రైళ్లు ఢీకొనడంతో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 73 మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక అధికారుల వివరాల ప్రకారం, మాలగా నుంచి మ్యాడ్రిడ్‌కు వెళ్తున్న ఓ రైలు పట్టాలు తప్పి, పక్క ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న హైస్పీడ్ రైలును ఢీకొట్టింది. మొదట పట్టాలు తప్పిన రైలులో సుమారు 300 మంది ప్రయాణికులు ఉండగా, రెండో రైలులో దాదాపు 100 మంది ఉన్నట్లు తెలిపారు.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో భద్రతా చర్యలలో భాగంగా సోమవారం మ్యాడ్రిడ్–మాలగా మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ ప్రమాదంపై స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత అసాధారణమైన ఘటనగా స్పెయిన్ రవాణా శాఖ మంత్రి ఆస్కర్ పుయెంతే పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!