
గాసిప్స్

భారతదేశంలో పవన విద్యుత్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6.05 గిగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యం ఏర్పాటు అయ్యింది. ఇది ఒకే ఏడాదిలో ఏర్పడిన అత్యధిక సామర్థ్యం.
ఈ రికార్డు 2016–17లో నమోదైన 5.5 గిగావాట్లను అధిగమించింది. దీంతో ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో మొత్తం పవన విద్యుత్ సామర్థ్యం 56 గిగావాట్లకు చేరుకుంది. ప్రభుత్వ విధానాల్లో స్పష్టత, పోటీ ధరలు, సరఫరా నెట్‌వర్క్ బలంగా ఉండటం వల్ల కొత్త ప్రాజెక్టులపై ఆసక్తి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన పవన విద్యుత్ ప్లాంట్లలో ఎక్కువ భాగం కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు దేశంలో పునరుత్పాదక ఇంధన అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!