

ఇజ్రాయెల్ వైమానిక దళం ఈ రోజు ఇరాన్‌లోని పలు కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరిపింది. మొత్తం 10 ముఖ్యమైన రైల్వే లైన్లు మరియు వంతెనలను లక్ష్యంగా చేసుకున్నట్లు ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తమ ఆయుధాలు, సైనిక పరికరాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించకుండా అడ్డుకునే ఉద్దేశంతో ఈ దాడులు జరిగినట్లు సమాచారం.
దాడులకు ముందు, ఇజ్రాయెల్ ఇరాన్ ప్రజలకు రాత్రి వరకు రైళ్లకు దూరంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. భద్రతా వర్గాల ప్రకారం, రివల్యూషనరీ గార్డ్స్ ఆయుధాలు, సైనిక సామగ్రి రవాణా కోసం ఈ రైల్వేలు మరియు హైవే వంతెనలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో అత్యంత భారీ ప్రభావం ఖర్గ్ ద్వీపంలోని చమురు టెర్మినల్‌పై పడింది. ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో 80 నుంచి 90 శాతం ఈ ప్రాంతం నుంచే జరుగుతుందని సమాచారం.
అదే సమయంలో కోమ్, కషాన్ ప్రాంతాల్లోని వంతెనలపై కూడా దాడులు జరిగాయి. కషాన్ సమీపంలోని యహ్యాబాద్ రైల్వే వంతెనపై జరిగిన దాడిలో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అదనంగా, వాయువ్య ఇరాన్‌లోని తబ్రిజ్–జంజన్ రహదారి వంతెనపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!