
క్రీడలు

టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులకు ముఖ్యమైన సూచనలు జారీ చేసింది. వచ్చే 48 గంటలపాటు వారు ఉన్న చోటే ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని తెలిపింది. భద్రత కోసం విద్యుత్ కేంద్రాలు, సైనిక ప్రాంతాలు, భవనాల పై అంతస్తులకు దూరంగా ఉండాలని సూచించింది.
భారతీయులు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని రాయబార కార్యాలయం కోరింది. హైవేలపై ప్రయాణం చేయాలంటే ముందుగా ఎంబసీతో సమన్వయం చేసుకోవాలని తెలిపింది. రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హోటళ్లలో ఉన్నవారు అక్కడి దౌత్య సిబ్బందితో నిరంతరం సంప్రదింపులో ఉండాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయుల భద్రత కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.



















.jpeg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!