

అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని తీవ్ర చలిగాలులు వణికిస్తున్నాయి. భారీగా కురుస్తున్న మంచుకు బలమైన గాలులు తోడవడంతో అధికారులు మంచు తుపాను హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు సుమారు 30 సెంటీమీటర్ల మందంతో మంచు కురిసినట్లు సమాచారం.
న్యూయార్క్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అక్కడి మెక్ ఆర్థర్ విమానాశ్రయంలో సుమారు 57 సెంటీమీటర్ల ఎత్తున మంచు పేరుకుపోయింది. నగరంతో పాటు కోనీ ఐలాండ్, న్యూజెర్సీ, న్యూ లండన్, కనెక్టికట్ ప్రాంతాల్లోనూ భారీ హిమపాతం నమోదైంది.
దట్టమైన పొగమంచు కారణంగా అనేక రహదారులను మూసివేయాల్సి వచ్చింది. న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మంచుతుపాను ప్రభావం విమాన రాకపోకల పై కూడా తీవ్రంగా పడింది. దేశవ్యాప్తంగా ఐదు వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్ ప్రాంతాల్లో విమానాల రాకపోకలు భారీగా నిలిచిపోయాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!