

ఆఫ్రికా దేశం కాంగోలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. లువాలాబా ప్రావిన్సులోని కలాండో ప్రాంతంలో ఉన్న రాగి గనిలో శనివారం భారీ ప్రమాదం సంభవించింది. పనిచేసే కార్మికులు దాటేందుకు ఏర్పాటు చేసిన వంతెన అకస్మాత్తుగా కూలిపోవడంతో 32 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
మొదట మైనింగ్ ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించడంతో కార్మికులు భయంతో ఆ వంతెన వైపు పరుగులు పెట్టారని, ఒక్కసారిగా భారీ సంఖ్యలో జనసమ్మర్థం పెరగడంతో వంతెన భరించలేక కుప్పకూలిపోయిందని మైనింగ్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.
కాంగోలో రాగి గనులు లక్షలాది మందికి ప్రధాన ఉపాధి మార్గం. ఈ రంగంపై 15–20 లక్షల మంది నేరుగా, ఇంకా మరెన్నో కుటుంబాలు పరోక్షంగా ఆధారపడుతున్నాయి. అయితే, భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. గతంలో కూడా ఈ ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!