

కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలోని వివిధ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్-గెజిటెడ్) మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి (గ్రూప్ సి) పోస్టుల ఫలితాలు తాజా విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ ప్రకారం స్కిల్ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించబడింది.
గ్రేడ్ సి: స్కిల్ టెస్ట్‌కు మొత్తం 8,624 మంది ఎంపిక అయ్యారు.
గ్రేడ్ డి: స్కిల్ టెస్ట్‌కు 22,456 మంది అర్హత సాధించినట్లు కమిషన్ తెలిపింది.
రిజర్వేషన్ ఆధారంగా కటాఫ్ మార్కులు కూడా వెబ్సైట్లో విడుదల చేయబడ్డాయి:
SC 135.44087
ST 120.37748
OBC 141.77465
EWS 137.83071
UR 142.42577
OH 119.93641
HH 73.62062
VH 95.27935
ఆగస్టు 6, 7, 8, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఆన్లైన్ రాత పరీక్షలు నిర్వహించబడ్డాయి. చివరి దశ అయిన స్కిల్ టెస్ట్ తేదీలను SSC త్వరలో ప్రకటించనుంది. నైపుణ్య పరీక్ష పూర్తయిన తర్వాత మాత్రమే తుది ఎంపిక జరుగుతుంది. కాబట్టి, ఈ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తప్పనిసరిగా హాజరుకావలసి ఉంటుంది.
ప్రస్తుత నియామక ప్రక్రియ ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు 261 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి పోస్టులను భర్తీ చేయనున్నారు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!