

తెలంగాణను దేశంలోనే ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం దావోస్‌లో యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రిన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రిన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్‌లతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ ఒప్పందం ప్రకారం భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, అవసరమైన విద్యుత్ సరఫరా కోసం 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ దశలో సుమారు 3,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుండగా, డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!