

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం గత రెండేళ్లుగా చరణ్ తీవ్రంగా శ్రమించారని చిత్రబృందం వెల్లడించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పలుమార్లు ప్రమాదాలకు గురైనా, షూటింగ్‌ను ఆపకుండా పూర్తి అంకితభావంతో పనిచేశారని దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, యాక్షన్ కొరియోగ్రాఫర్, నిర్మాత తెలిపారు.
చిత్ర నిర్మాత వెంకట్ సతీష్ మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో చరణ్‌కు మూడు పెద్ద గాయాలు అయ్యాయని వెల్లడించారు. కంటికి గాయంతో పాటు మణికట్టుకు తీవ్ర గాయం కావడంతో ప్రస్తుతం చిన్న సర్జరీ చేయించుకోనున్నారని తెలిపారు. కుస్తీ సన్నివేశాల చిత్రీకరణలో కండరాలు పట్టేయడం, కాలు బెణకడం వంటి సమస్యలు ఎదురైనా విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. చరణ్ కోసం ప్రత్యేకంగా ఫిజియోథెరపిస్ట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల కంటికి చిన్న సర్జరీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మణికట్టుకు మరో సర్జరీ జరగనున్నట్లు తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!