
జనరల్

శ్రీలంక క్రికెట్ శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఇండియా నేషనల్ క్రికెట్ టీమ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025–2027 సైకిల్‌లో భాగంగా నిర్వహించబడనుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత టీమిండియా శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడనుండటం విశేషం.

ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండు జట్లకూ కీలకంగా మారనుంది. అన్ని మ్యాచ్‌లు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. మొదటి టెస్ట్ ఆగస్ట్ 15 నుంచి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుండగా, రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి 27 వరకు కొలంబోలో నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!