
జనరల్

సెలబ్రిటీలు పాల్గొనే ఈవెంట్లలో అభిమానులు, ఫొటోగ్రాఫర్లు తమ ఫోన్లు, కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం సాధారణంగా మారింది. అయితే కొంతమంది తప్పుడు యాంగిల్స్‌లో ఫొటోలు తీయడం, వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడం గురించి ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్ నటి నేహా ధూపియాకు కూడా ఇదే తరహా అనుభవం ఎదురైంది.
ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నేహా ధూపియా, కొందరు ఫొటోగ్రాఫర్లు తప్పుడు కోణంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని గమనించి తీవ్రంగా స్పందించారు. ఇలా చేయడం తగదని, మహిళల గౌరవాన్ని కాపాడాలని ఆమె మీడియాను గట్టిగా హెచ్చరించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!