
బిజినెస్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి మేఘాలయ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అరెస్టు పత్రాల్లో జరిగిన టైపోగ్రాఫికల్ పొరపాటునే బెయిల్‌కు కారణంగా చూపారని, అది పెద్ద చట్టపరమైన లోపం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.
బెయిల్‌పై విడుదలైతే సోనమ్ పరారయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం వాదించింది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ శీల్ నాగులతో కూడిన ధర్మాసనం కేసును శుక్రవారం విచారణకు జాబితాలో చేర్చేందుకు అంగీకరించింది. మరోవైపు, బాధిత కుటుంబం కూడా సోనమ్‌కు బెయిల్ మంజూరు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!