

‘లెనిన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న అక్కినేని అఖిల్, తన జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటనను తాజాగా వెల్లడించారు. ‘ఏజెంట్’ సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత తనకు తీవ్ర ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇంట్లో బాత్‌రూమ్ ఫ్లోర్ తడిగా ఉండటంతో కాలు జారి కిందపడిపోయానని, అక్కడ ఉన్న పగిలిన గాజు ముక్క బలంగా గుచ్చుకోవడంతో తీవ్ర గాయమైందని వివరించారు.
ఆ గాయం తీవ్రంగా ఉండటంతో రెండు సర్జరీలు చేయాల్సి వచ్చిందని, మొత్తం 48 కుట్లు వేశారని అఖిల్ తెలిపారు. పూర్తిగా కోలుకుని మళ్లీ సాధారణ జీవితంలోకి రావడానికి 16 నెలలు పట్టిందని చెప్పారు. ‘ఏజెంట్’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడం ఒకవైపు బాధ కలిగిస్తే, ఈ ప్రమాదం తనను శారీరకంగా మరింత దెబ్బతీసిందని పేర్కొన్నారు. ఈ కారణంగానే చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ‘లెనిన్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!