
సినిమాలు

భారత్, జపాన్ మధ్య పలు కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకాయిచి సమక్షంలో ఈ ఒప్పందాలపై అధికారికంగా సంతకాలు జరిగాయి. ఫార్మా, రక్షణ, తీరప్రాంత భద్రత, కృత్రిమ మేధస్సు (AI) వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసేలా ఈ ఒప్పందాలు కుదిరాయి.
ఒప్పందాల అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారత్–జపాన్ భాగస్వామ్యం మరింత బలపడుతుందని తెలిపారు. రానున్న పదేళ్లలో భారత్‌లో జపాన్ 10 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పెట్టుబడులు ఆర్థికాభివృద్ధి, సాంకేతిక రంగాల విస్తరణకు దోహదపడటంతో పాటు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!