
రాజకీయాలు

మొదటి వివాహం చట్టబద్ధంగా కొనసాగుతుండగానే రెండో భర్త నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసిన మహిళపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో భరణం పేరుతో డబ్బు కోరడం సమంజసం కాదని, ఆరోపణలు బ్లాక్‌మెయిల్, వసూళ్ల కేసుకు దారి తీసేలా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో విచారణ, క్రిమినల్ చర్యలు కొనసాగాలని ఆదేశించింది.
మొదటి వివాహం కొనసాగుతుండటంతో రెండో వివాహం చట్టబద్ధం కాదని ఇప్పటికే తేలిందని హైకోర్టు గుర్తుచేసింది. అయితే మహిళ తల్లి, సోదరుడిపై సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ వారిపై నమోదైన క్రిమినల్ కేసులను రద్దు చేసింది. 2017లో పుణెలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన పిటిషన్‌పై ఈ తీర్పు వెలువడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!