
సినిమాలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ మరియు భారత్ రాష్ట్ర సమితిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, వారి రాజకీయ ప్రవర్తన బిగ్‌బాస్ షోను తలపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా నాటకీయ ప్రదర్శనలతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటన అద్భుతమని వ్యంగ్యంగా పేర్కొన్నారు.
ఇద్దరు పార్టీల నాయకులు ముందుగానే రిహార్సల్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డులు ఇస్తే ఈ రెండు పార్టీలే అర్హులని అన్నారు. తెలంగాణ ప్రజలు వీరి వ్యవహారాలను చూసి నవ్వుకుంటున్నారని పేర్కొంటూ, నిజమైన నాయకత్వం లోపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!