

పెద్ది తో రామ్‌చరణ్ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా ప్రమోషన్స్‌కు శ్రీకారం చుడుతూ మే 18న ముంబయిలో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనంతరం మే 23న భోపాల్‌లో మరో భారీ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రామ్ చరణ్ ఆటకూలీ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
సినిమా కథలోని కీలక అంశాలపై కూడా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. క్రికెట్, కుస్తీ పోటీల నేపథ్యంలో సాగే ఈ కథలో ‘పెద్ది’ గ్రామానికి సంబంధించిన ఎమోషనల్ పాయింట్ ప్రధాన ఆకర్షణగా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. గ్రామ శ్రేయస్సు కోసం పెద్ది తీసుకునే నిర్ణయాలే కథకు కేంద్రబిందువని చెబుతున్నారు. జగపతిబాబు రామ్ చరణ్ తండ్రిగా, శివరాజ్‌కుమార్ కోచ్ పాత్రలో కనిపించనున్నారని, ఈ పాత్రలు కథలో కీలకంగా ఉండనున్నాయని సమాచారం. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, సంగీతాన్ని ఏఆర్రెహమాన్ అందిస్తున్నారు. బుచ్చిబాబుసనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!