

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ఒకప్పుడు మాటలతో పాటు ప్రతి పాత్రకు ఉండే ప్రత్యేకత కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచేది. ముఖ్యంగా ‘నువ్వే నువ్వే’లో సునీల్, ప్రకాష్ రాజ్ పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంది. హీరోతో పాటు సహాయ పాత్రలకు కూడా బలమైన ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ఇటీవలి సినిమాలను పరిశీలిస్తే రెండో హీరోలు, హీరోయిన్లకు ఆశించిన స్థాయిలో ప్రాముఖ్యత దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
‘అలా వైకుంఠపురములో’ సుశాంత్ పాత్రతో పాటు ‘ఆదర్శ కుటుంబం’లో నారా రోహిత్ పాత్ర కూడా ప్రేక్షకుల్లో ఇలాంటి ప్రశ్నలనే రేకెత్తించాయి. అలాగే ‘అఆ’లో అనుపమ పరమేశ్వర్ మినహా ఇతర చిత్రాల్లో రెండో హీరోయిన్ల పాత్రలు పెద్దగా గుర్తింపు పొందడం లేదనే అభిప్రాయాలున్నాయి. ‘జల్సా’లో పార్వతి మెల్టన్ నుంచి ‘ఆదర్శ కుటుంబం’లో నివేదా పేతురాజ్ వరకు ఇదే చర్చ సాగుతోంది. పాత్రలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పి, తెరపై తక్కువ సన్నివేశాలకే పరిమితం చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. పేరున్న నటులను తీసుకున్నప్పుడు వారికి తగిన పాత్రలు రాయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!