

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ ప్రకటించిన ‘టైమ్100 నెక్స్ట్ ఇండియా–2026’ జాబితాలో ఆయన చోటు సంపాదించారు. మ్యూజిక్ విభాగంలో అనిరుధ్‌కు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. అనిరుధ్ నిజమైన ఇండియన్ పాప్‌స్టార్ అంటూ అభినందించారు.
అనిరుధ్ అద్భుతమైన సంగీత ప్రతిభ కలిగిన వ్యక్తి అని అల్లు అర్జున్ కొనియాడారు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఆయన పనితీరును గమనిస్తున్నానని తెలిపారు. గత దశాబ్దకాలంగా తన సంగీతంతో తమిళ చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. భాషలు, సంస్కృతులు, సరిహద్దులను దాటి ఆయన సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోందన్నారు. ‘విక్రమ్’ నుంచి ‘జైలర్ 2’ వరకు పలు చిత్రాలకు తన నేపథ్య సంగీతంతో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని ప్రశంసించారు. అనిరుధ్ అభిమానుల్లో తానే మొదటి స్థానంలో ఉంటానని అల్లు అర్జున్ సరదాగా వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!