

కమర్షియల్ సినిమాలతో వరుస విజయాలు అందుకోవడం అంత సులభమైన విషయం కాదు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా కథలను సిద్ధం చేస్తూ విజయాలు సాధించాలి. ఈ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటికే వరుసగా 9 విజయాలు అందుకున్న ఆయన, ఇప్పుడు పదో సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. 2027 సంక్రాంతికి కూడా తన సినిమా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రతి ఏడాది ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న అనిల్ రావిపూడి పనితీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సినిమాలతో పాటు కార్యక్రమాలకు అతిథిగా వెళ్లడం, కొన్ని ప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం వంటి పనులు చేస్తున్నా విడుదల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు చాలామంది దర్శకులు ఒక్క సినిమా పూర్తి చేయడానికి 2 నుంచి 3 ఏళ్లు తీసుకుంటున్నారు. అయినా విడుదల తేదీలు వాయిదా పడుతున్నాయి. అనిల్ ప్రణాళికను చూసి ఇతర దర్శకులు కూడా నేర్చుకోవాలని, సినిమాల నిర్మాణ వేగం పెరిగితే పరిశ్రమకు, కార్మికులకు మేలు జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!