

టాలీవుడ్ యువ కథానాయకుడు ప్రిన్స్ సిసిల్ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆయన, ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నాడు. ముఖ్యంగా భార్య సాయి న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆమెకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. కొత్త వాతావరణానికి అలవాటు పడే సమయంలో భార్యతో ఎక్కువ సమయం గడపడం ముఖ్యమని భావిస్తున్నాడట.
ఈ కారణంగానే డిసెంబర్ వరకు కొత్త సినిమాలకు అంగీకరించకూడదని ప్రిన్స్ నిర్ణయించుకున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మళ్లీ కథలు వినడం మొదలుపెడతానని స్పష్టం చేశాడు. మరోవైపు ఇటీవల విడుదలైన ‘అనుమాన పక్షి’ సినిమాతో పాటు ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అంతర్జాల కార్యక్రమానికి మంచి స్పందన రావడంపై సంతోషం వ్యక్తం చేశాడు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం కంటే కొంతకాలం విరామం తీసుకుని కుటుంబంతో గడపడమే ప్రస్తుతం తనకు ముఖ్యమని ఆయన భావిస్తున్నాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!