

‘మహేంద్రగిరి వారాహి’ తమ రెండున్నరేళ్ల కష్టానికి ఫలితమని కథానాయకుడు సుమంత్ తెలిపారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా గురించి సుమంత్ మాట్లాడుతూ.. కథ మూడేళ్ల కిందటే ఖరారైందని, అయితే పలు కారణాల వల్ల సరైన నిర్మాతలు దొరకక ప్రాజెక్ట్ ఆలస్యమైందని చెప్పారు. ఆ తర్వాత మధు, లక్ష్మణ్ నిర్మాతలుగా రావడంతో సినిమా పట్టాలెక్కిందని తెలిపారు.
చిత్రీకరణ సమయంలో ఎదురైన ఇబ్బందులను కూడా సుమంత్ గుర్తుచేసుకున్నారు. షూటింగ్ సమయంలో దర్శకుడు సంతోష్ జాగర్లపూడి కాలికి తీవ్ర గాయం కావడంతో పాటు కాలు విరిగిందని చెప్పారు. అయినప్పటికీ ఆయన షూటింగ్‌కు వచ్చి సినిమాను పూర్తి చేశారని, కొన్నిసార్లు ఆయన్ను ఎత్తుకుని షూటింగ్ ప్రదేశానికి తీసుకెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. తన కాలు కూడా బెణికిందని, అయినా షూటింగ్ ఆపకుండా డ్యాన్స్ చేసినట్లు సుమంత్ వెల్లడించారు. ఎన్నో సవాళ్లను దాటి పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!